అహ్మదాబాద్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ : అశ్విన్‌కు ఆరు వికెట్లు
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఖవాజా, గ్రీన్ సెంచరీలతో పాటు టెయిల్ ఎండ్ అటగాళ్లు రాణించడంతో కంగారులు భారీ స్కోరు చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (180), ఆల్ రౌండర్ గ్రీన్ (114)లు సెంచరీల మోత మోగించారు. దీంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులుచేసింది. మ్యాచ్ చివర్లో టెయిలెండర్లు టాడ్ మర్ఫీ 41, నాథన్ లైయన్ 34 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన ఆరు వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. షమీ 2, జడేజా 1, అక్షర్ పటేల్ ఒకటి చొప్పున వికెట్ తీశారు.
ఆ తర్వాత రెండో రోజు చివరి సెషన్‌లో తన తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 10, రోహిత్ శర్మ 8 పరుగులతో ఆడుతున్నారు.