ఆప్ఘనిస్థాన్‌తో భారత్ మ్యాచ్ : టార్గెట్ 273 రన్స్
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టుతో భారత్ తలపడింది. ఢిల్లీ వేదికగా జరిగిన జరుగుతున్న మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 272 పరుగులు చేసింది. ఆ తర్వాత 273 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. టాస్ నెగ్గిన ఆప్ఘన్ కెప్టెన్ షాహిద్ బ్యాటింగ్ ఎంచుకుని, భారత్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు. అనారోగ్యం కారణంగా శుభమన్ గిల్ ఈ మ్యాచ్ కూడా దూరంగా ఉన్నాడు.
ఆప్ఘన్ జట్టు ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ 21, జడ్రాన్ 28, షా 22, షాహిది 80, ఒమర్జాయ 62, నబి 19, రషీద్ ఖాన్ 16, రెహ్మాన్ 10, జడ్రాన్ 2 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, హార్దిక్ పాండ్యా 2, ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఫలితంగా ఆప్ఘన్ జట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.