శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2019 (11:16 IST)

రాంచీ టెస్ట్ : రహానే సెంచరీ... డబుల్ సెంచరీ దిశగా రోహిత్

జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లో భారత క్రికెట్ జట్టు ప‌ట్టు బిగించింది. తొలి రోజు మూడు వికెట్స్ త‌క్కువ వ్య‌వ‌ధిలో కోల్పోయిన భార‌త్‌ని రోహిత్ శ‌ర్మ 159 (21 ఫోర్స్, 4 సిక్స్‌లు), అజింక్యా ర‌హానే 101( 14 ఫోర్స్, 1 సిక్స్‌) ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ కెరీర్‌లో మ‌రో సెంచరీ పూర్తి చేశాడు. 
 
ఇక రోహిత్ శ‌ర్మ చెత్త బంతిని బౌండ‌రీకి తర‌లిస్తూ డ‌బుల్ సెంచ‌రీ దిశ‌గా దూసుకెళుతున్నారు. సౌతాఫ్రికా బౌల‌ర్స్ మ‌రో వికెట్ కోసం గ‌ట్టిగానే కృషి చేస్తున్న‌ప్ప‌టికి ఫ‌లితం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం భార‌త్ మూడు వికెట్ల న‌ష్టానికి 284 ప‌రుగులు చేసింది. తొలి రోజు ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 58 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు చేసిన సంగ‌తి తెలిసిందే. సఫారీ పేసర్ కగిసో రబాడ రెండు వికెట్స్ తీయ‌గా, నోర్జె ఒక వికెట్ తీసాడు. 
 
అంతకుముందు తొలి రోజు ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 58 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు చేసిన విషయం తెల్సిందే. సొంతగడ్డపై ఎదురులేకుండా సాగుతున్న భారత్.. చివరి టెస్టులోనూ అదే దూకుడు కనబర్చింది. సిరీస్‌లో వరుసగా మూడోసారి టాస్ నెగ్గిన కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం బాగా కలిసివచ్చింది. టాపార్డర్‌లో ఓ బ్యాట్స్‌మన్ శతకం మరొకరు డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నారు.