శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (11:30 IST)

రాంచీ టెస్టు : భారత్ బ్యాటింగ్... స్పిన్నర్ షాబాజ్ న‌దీమ్‌ అరంగేట్రం

జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో భారత్ - సౌతాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య తొలి టెస్ట్ శనివారం ప్రారంభమైంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా తరపున స్పిన్నర్ షాబాజ్ న‌దీమ్ తొలిసారి టెస్టుల్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. గాయపడిన కల్దీప్ యాదవ్‌ను తుది జట్టులో నుంచి తొలగించి, స్థానిక కుర్రోడికి చోటు కల్పించారు.
 
ఇకపోతే, ఇప్పటికే రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో స్థానిక క్రికెటర్ అయిన నదీమ్ షాబాజ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. 
 
ఈ కుర్రోడు ఇటీవ‌ల దేశ‌వాళీ టోర్నీల్లో అత్య‌ద్భుతంగా రాణించాడు. న‌దీమ్ టీమిండియా త‌ర‌పున ఆడ‌డం ఆనందంగా ఉంద‌ని కెప్టెన్ కోహ్లీ అన్నాడు. మూడో టెస్టులో ఇశాంత శర్మ‌కు బ్రేక్ ఇచ్చారు.
 
అలాగే, సౌతాఫ్రికా జ‌ట్టులో రెండు మార్పులు జ‌రిగాయి. టెస్టుల్లో హెన్రిచ్ క్లాసెన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ జార్జ్ లిండే కూడా తొలి టెస్టు ఆడ‌నున్నాడు. భార‌త్ మూడు ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 7 ప‌రుగులు చేసింది.