నేహా కక్కర్‌కు చేదు అనుభవం.. బుగ్గపై ముద్దెట్టిన అభిమాని

సెల్వి| Last Updated: శుక్రవారం, 18 అక్టోబరు 2019 (15:26 IST)
సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడోల్ 11లో ప్రముఖ గాయని నేహా కక్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమానికి ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే ఓ ఫ్యాన్ కోసం స్టేజ్ ఎక్కిన నేహా కక్కర్.. అతను ఇచ్చిన కిస్‌తో షాకైంది. ఆడిషన్ రౌండ్‌లో కంటిస్టెంట్స్ స్టేజ్‌పైకి ఎంటర్ అవుతుంటారు. ఆ సందర్భంగా తమ అభిమాన గాయకులకు కానుకలు ఇస్తుంటారు.

అలా ఓ రాజస్థానీ వ్యక్తిగా వచ్చిన అభిమాని కక్కర్‌కు టెడ్డీని ఇచ్చాడు. అభిమానిని హత్తుకుని టెడ్డీని తీసుకున్న నేహా కక్కర్‌కు షాక్ మిగిలింది. ఆ అభిమాని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. దీంతో తప్పుకున్న కక్కర్ షాకైంది. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆదిత్యా నారాయణన్ ఆ ఫ్యాన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మరో జడ్జి అను మాలిక్ కూడా షాకైయ్యాడు. నేహాకు బుగ్గపై ముద్దెట్టిన అభిమానిని ఏంటిది అన్నట్లు అడిగాడు.

కాగా తెలుగులో నాగార్జున నటించిన కేడీలో నీవేనా నీవేనా పాటతో పాటు 'అలా ఎలా'లో 'థనక్ థనక్' పాటను నేహానే పాడారు. ప్రస్తుతం ఓ కంటిస్టెంట్ నేహా కక్కర్‌కు బుగ్గపై ముద్దెట్టడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.దీనిపై మరింత చదవండి :