శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (18:32 IST)

కోహ్లీ కెప్టెన్సీపై గంగూలీ ఏమన్నాడు..? ఐసీసీ టోర్నీలపై దృష్టి పెట్టాలట..

బీసీసీఐ అధ్యక్షుడిగా దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియామయం ఖాయమైంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కెప్టెన్సీలో మన జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోందని కొనియాడాడు. అయితే, కీలకమైన ఐసీసీ టోర్నీలో మాత్రం ఓటమి చవిచూశారని.. దీనిని అధిగమించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంటుందని చెప్పాడు. 
 
ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌తో సరిపెట్టుకోవడంపై కూడా గంగూలీ కామెంట్లు చేశాడు. ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ సెమీఫైనల్‌, ఫైనల్స్‌లో రాణించలేకపోతున్నారు. ఇకపై ఆ సీన్ మారాలి. విరాట్ సారథ్యంలో మన జట్టు మెరుగైన విజయాలతో రాణించాలని సూచించాడు.
 
2013లో ధోని సారధ్యంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవలేదు. కానీ కోహ్లీ సారధ్యంలో టీమిండియా ఇంటాబయటా మెరుగైన ఆటతో దూసుకెళ్తోంది. అయినా ఐసీసీ టోర్నీలపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని గంగూలీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.