శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2023 (14:07 IST)

వన్డే ప్రపంచ కప్ : సఫారీలతో పోరు.. భారత్ బ్యాటింగ్

india vs south africa
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం బరిలోకి దించిన తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. 
 
టాస్ నెగ్గిన తర్వాత రోహిత్ శర్మ స్పందిస్తూ, పిచ్ చాలా బాగుంది. అయితే, పిచ్‌తో సంబంధం లేకుండా సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఇదొక మంచి గేమ్ అవుతుంది. ఈ మ్యాచ్‌‍లోనూ విజయం సాధించి అగ్రస్థానంలో నిలవాలన్న పట్టుదలతో ఉన్నాం. ఈడెన్ గార్డెన్స్ వంటి చరిత్రాత్మక మైదానంలో ఆడేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఈ మ్యాచ్ కోసం జట్టులో మార్పులు చేయాల్సిన అవరం లేదు. గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టునే బరిలోకి దించాం. 
 
ఈ సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా స్పందిస్తూ, టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నాం. అయితే, ఇపుడు ఛేజింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సవాల్ స్వీకరిస్తాం. ఛేజింగ్‌లో మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మా బ్యాటింగ్ విభాగం మంచి ప్రదర్శన ఇస్తుంది అని అన్నారు. 
 
ఈ జట్టు కోసం బరిలోకి దిగిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
సౌతాఫ్రికా : క్వింటన్ డికాక్, టెంబా బావుమా, రస్సీ వాండర్ డసెన్, మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెస్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, షంసి, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.
 
భారత్ : రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్, సూర్యకుమార్, రవీంద్ర జడేజా, షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్.