శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2019 (17:36 IST)

పంత్ అవుట్.. షాట్ ట్రై చేసి అవుట్ అయ్యాడు..

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పరుగుల వేటలో కొనసాగుతోంది. 43 ఓవర్లకు భారత్ స్కోరు 235 పరుగులు చేసి 5 వికెట్లు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఆదిలోనే కీలక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ బాట పట్టించింది. 
 
ఓపెనర్ కేఎల్ రాహుల్ (6), కెప్టెన్ కోహ్లీ(4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ (36) కొద్దిగా పరుగుల వేట ప్రారంభించినప్పటికీ జోసెఫ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
 
పంత్ 49 బంతుల్లో 50 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 70 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 70 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్‌.. జోసెఫ్ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్‌గా చిక్కి ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 88 బంతుల్లో ఒక సిక్స్, 5 ఫోర్లతో అయ్యర్ మొత్తం 70 పరుగులతో రాణించాడు.
 
ఆ తర్వాత పంత్ దూకుడుకు పొలార్డ్ కళ్లెం వేశాడు. పొలార్డ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రిషబ్ పంత్ హెట్మయిర్ క్యాచ్ పట్టుకోవడంతో పెవిలియన్ బాట పట్టాడు. పంత్ 69 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అయితే పంత్ గతంలో సైతం ఇలాంటి షాట్ ట్రై చేసి ఔట్ అవ్వడం గమనార్హం.