సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (18:57 IST)

14 నెలల తర్వాత ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ రీ ఎంట్రీ

rishabh panth
వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ 14 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో దిగనున్నాడు. వచ్చే ఐపీఎల్ ఎడిషన్‌లో పాల్గొనేందుకు అతడు ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 2022లో రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రగాయాలతో క్రికెట్‌కు దూరమయ్యాడు.
 
ప్రస్తుతం తాను గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నానని.. క్రికెట్ ఆడేందుకు ఉత్సాహంగా వున్నానని చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, బీసీసీఐ, ఎన్సీఏ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.  
 
బుధవారం విశాఖపట్నంలో డీసీ ప్రీ-సీజన్ క్యాంపు ద్వారా రిషబ్ పంత్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఆడేందుకు ఎన్సీఏ చేత అనుమతి పొందాడు. ఫలితంగా రిషబ్ పంత్ ఐపీఎల్‌ ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంత్ ఆడనున్నాడు.