శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (07:42 IST)

ఐపీఎల్-15 ఫైనల్ మ్యాచ్ హైలెట్స్ ఏంటి? బ్యాటింగ్ ఎంచుకుని ఓడిందా?

ipl2022
ఐపీఎల్-15వ సీజన్ పోటీలు ముగిశాయి. ఆదివారం రాత్రి గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఉన్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడగా, గుజరాత్ జట్టు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన తొలిసారే విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ హైలెట్స్‌ను ఓ సారి పరిశీలిస్తే, 
 
ఈ టోర్నీ మొత్తంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ నెగ్గడం చాలా అరుదుగా కనిపించింది. కానీ, ఫైనల్ మ్యాచ్‌లో సంజూ టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచింది. పిచ్ కొంత పొడిగా ఉండటంతో గత చరిత్ర ఆధారంగా సంజూ శాంసన్ సాహసోపేత నిర్ణయమే తీసుకున్నాడని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఫెర్గూసన్ బుల్లెట్ లాంటి బంతులతో బెంబేలెత్తించాడు. 5వ ఓవర్‌లో మూడు బంతులను గంటకు 150 కిమీ వేగంతో విసిరాడు. ఈ క్రమంలో ఆఖరి బంతిని గంటకు 157.3 కిమీ వేగంతో వేసిన ఫెర్గూసన్ విసిరాడు. ఫలితంగా ఈ సీజన్‌లో అత్యంధిక వేగవంతమైన డెలివరీని బౌల్ చేశాడు. తద్వారా సన్ రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ (157 కిమీ)ని అధికమించాడు.