Virat Kohli: రోహిత్ శర్మ బాటలో విరాట్ కోహ్లీ.. ఆ పని చేస్తే ఆటగాళ్ల గైడన్స్ కష్టమే
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో భారత క్రికెట్‌లో మరో అతిపెద్ద బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో తన భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించాడు. విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయితే టీమిండియాకు ఇంగ్లాండ్‌లో ఉన్నఇద్దరు అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్ల గైడెన్స్ లభించదు. విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని బీసీసీఐ కోరుతున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ అభ్యర్థనకు కోహ్లీ ఇంకా స్పందించలేదు.