ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (11:40 IST)

యాషెస్ సిరీస్: జో రూట్ స్టంప్.. టెస్టు కెరీర్‌లో రికార్డ్

Joe Root
ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 46 పరుగులు సాధించాడు. అయితే నాథన్ లైయన్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయ్యాడు. జోరూట్ తన టెస్ట్ కెరీర్‌లో స్టంపౌట్ కావడం ఇదే తొలిసారి. తద్వారా మొదటిసారి ఇలా ఔటైన రూట్ రికార్డు అందుకున్నాడు. 
 
అలాగే, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ లను అధిగమించి, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసి స్టంపౌంట్ అయిన రెండో ఆటగాడిగా నిలిచాడు. జోరూట్ ఇప్పటి వరకు 131 టెస్టులు ఆడి, 11,168 పరుగుల వద్ద తొలిసారి స్టంపౌట్ అయ్యాడు. 
 
జో రూట్ కంటే ముందు వెస్టిండీస్ మాజీ ఆటగాడు శివనారాయణ్ చందర్ పాల్ ఈ జాబితాలో 11,414 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.