గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నికర ఆస్తి రూ.1000 కోట్లా?

Kohli
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నికర ఆస్తి రూ.1000 కోట్లంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనితోడు స్టాక్ గ్రో అనే సంస్థ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్థాయిలో నికర ఆస్తి కలిగిన ఏకైక ఆటగాడు ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమేనని ఆ సంస్థ పేర్కొంది. 34 యేళ్ల కోహ్లీ.. బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాలో 'ఏ' గ్రేడ్‌లో ఉన్నారు. ఆయనకు సంవత్సరానికి రూ.7 కోట్ల మేరకు పారితోషికం అందుకుంటున్నారు. ప్రతి టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు చొప్పున మ్యాచ్ ఫీజ్ అందుకుంటున్నారు. 
 
ఐపీఎల్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించినందుకు అదనంగా రూ.15 కోట్ల మేరకు నజరానా అందుకున్నారు. దీనికితోడు వాణిజ్య ప్రకటనలు, పలు బ్రాండ్లకు ప్రచారకర్తలుగా ఉన్నందుకు మరికొంత మొత్తంలో నగదు అందుకుంటున్నారు. ఇలా 18కి పైగా బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న కోహ్లీకి యేడాదికి రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేరకు సంపాదిస్తున్నాడు. బాలీవుడ్, స్పోర్ట్స్ ఇండస్ట్రీలో ఇంత మొత్తం సంపాదిస్తున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే కావడం గమనార్హం. కేవలం బ్రాండ్ల ఎండార్స్‌మెంట్ల ద్వారానే దాదాపు రూ.175 కోట్ల మేరకు అర్జిస్తున్నాడు. 
 
ఇకపోతే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టుకు రూ.8.9 కోట్లు, ట్వీట్‌కు రూ.2.5 కోట్లు చొప్పున పుచ్చుకుంటున్నాడు. ముంబైలో అతనికున్న ఇంటి విలువ రూ.34 కోట్లు. గురుగ్రామ్‌లో ఉన్న ఇంటి విలువ రూ.80 కోట్లు. రూ.31 కోట్ల విలువ చేసే సూపర్ లగ్జరీకార్లు ఉన్నాయి. ఇవికాకుండా ఇండియన్ సూపర్ లీగ్‌లో ఎఫ్ సీ గోవా ఫుట్‌బాల్ క్లబ్‌లో జట్టుకు యజమాని. అలాగే, ఒక టెన్నిస్ జట్టు, ప్రో రెజ్లింజ్ జట్టు కూడా ఉంది.