ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (15:29 IST)

ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్.. వరద బాధితులకు కోటి విరాళం

cricket stadium
ఏకగ్రీవ ఎన్నికలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ నియమితులయ్యారు. అలాగే ఏసీఏ ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు. 
 
కాగా, వరద బాధితులకు సాయం అందించాలని నూతన కార్య వర్గం తమ తొలి నిర్ణయాన్ని తీసుకుంది. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించింది.
 
కాగా, శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలోని గోపీనాథ్ రెడ్డి కార్యదర్శిగా ఉన్న ఏసీఏ కార్యవర్గం ఆగష్టు 4న రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. అయితే కొత్త కార్యవర్గం ఎన్నికకు కేశినేని ప్యానెల్ నుంచి మాత్రమే నామినేషనల్ దాఖలయ్యాయి.