సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (23:16 IST)

ఐపీఎల్‌కు ఎంపిక చేయలేదనీ జూనియర్ డేల్ స్టెయిన్ సూసైడ్!!

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు వచ్చే నెల 17వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మ్యాచ్‌ల కోసం ఇప్పటికే జట్లను ఎంపిక చేశారు. అయితే, వర్థమాన క్రికెటర్ ఒకరు ఐపీఎల్‌కు ఎంపిక చేయలేదని మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ క్రికెటర్ పేరు కరణ్ తివారీ. ఈ ఫాస్ట్ బౌలర్‌కు జూనియర్ డేల్ స్టెయిన్ అనే పేరు ఉంది. దీనికి కారణం ఆస్ట్రేలియాకు చెందిన స్టెయిన్ శైలిలో బౌలింగ్ వేయడమే. ఈ ఘటన ముంబైలోని మలాద్‌లో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, ముంబై మలాద్‌కు చెందిన కరణ్ తివారీ వర్ధమాన క్రికెటర్. ఈ ఫాస్ట్ బౌలర్ తనను ఐపీఎల్‌లోకి తీసుకోలేదన్న వేదనతో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. పడక గది నుంచి ఎంతకీ బయటికి రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసిన కుటుంబ సభ్యులకు ఫ్యాన్‌కు వేళ్లాడుతూ విగతజీవుడిలా కనిపించాడు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లేకపోవడంతో పోలీసులు దీన్ని ప్రమాదవశాత్తు మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు.
 
కాగా, కరణ్ తివారీని ముంబై క్రికెట్ వర్గాల్లో అందరూ 'జూనియర్ స్టెయిన్' అంటారు. తివారీ బౌలింగ్ స్టయిల్ అచ్చం సఫారీ స్పీడ్ స్టర్ డేల్ స్టెయిన్‌ను పోలివుండటమే అందుకు కారణం. ముంబై వాంఖడేలో ఐపీఎల్ జట్లకు నెట్ బౌలర్‌గా సేవలు అందిస్తున్నాడు. అయితే, కరణ్ తివారీని ఏ ఫ్రాంచైజీ తీసుకోనందునే అతడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.
 
ఈ ఘటనకు ముందు కరణ్ తివారీ రాజస్థాన్‌లో ఉన్న మిత్రుడికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఆ మిత్రుడు రాజస్థాన్‌లోనే ఉంటున్న కరణ్ సోదరికి విషయం తెలుపగా, ఆమె ముంబై ఫోన్ చేసి తన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది. అప్పటికే జరగకూడదనిది జరిగిపోయింది.