శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 ఆగస్టు 2020 (13:29 IST)

సివిల్స్ ర్యాంకర్‌పై ముంబై పోలీసుల ఎఫ్ఐఆర్.. ఎందుకు?

ఇటీవల వెల్లడైన యూపీఎస్సీ సివిల్స్ 2019 ఫలితాల్లో ర్యాంకర్‌గా నిలించిన ఐశ్వర్య షెరోన్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈమె మిస్ ఇండియా మాజీ ఫైనలిస్ట్ కూడా. ఐశ్వ‌ర్య పేరుతో 20 న‌కిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయ‌ని ఓ 23 ఏడ్ల వ్య‌క్తి కొలాబా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ యాక్ట్ కింద ఆమెపై ఆగ‌స్టు 6న ఎఫ్ఐఆర్ న‌మోదు చేశామ‌ని ఇన్‌స్పెక్ట‌ర్ శివాజీ తెలిపారు.
 
అయితే, ఈ కేసులో ఎవ‌రినీ అరెస్టు చేయ‌లేద‌ని, ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని చెప్పారు. కాగా, త‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే లేదని ఐశ్వ‌ర్య చెప్పారు. ఎవ‌రో త‌న పేరుతో అకౌంట్లు సృష్టించార‌ని, త‌న అనుమ‌తి లేకుండా త‌న ఫొటోలు, వీడియోలు పెడుతునున్నార‌ని తెలిపారు. తాజాగా వెలువ‌డిన యూపీఎస్సీ ఫ‌లితాల్లో ఆమె 93వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురవుతోంది.