గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (13:05 IST)

ధోనిని మించిన మెంటార్ లేడు: కేఎల్ రాహుల్

భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ భారత మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనిని మించిన మెంటార్ లేడని అన్నారు. ధోని డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, చాలా రోజుల తరువాత ధోని తిరిగి జట్టుతో చేరడం సంతోషంగా ఉందని తెలిపాడు. రానున్న రోజుల్లో ధోని ఆలోచనలను తాను వాడుకుంటానని, గత కొన్నిరోజులుగా దానితో సమయాన్ని గడపడం ఎంతో విలువైనదిగా భావిస్తున్నట్లు రాహుల్ తెలిపాడు.
 
40 ఏళ్ళు దాటినా ఇప్పటికి యువ ఆటగాళ్ళ కంటే భారీ సిక్సర్లు కొట్టగలడని, వేగంగా వికెట్ల మధ్య పరుగులు కూడా తీయగలడని చెప్పుకొచ్చాడు. ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా అతడిని ఒక మెంటార్ లానే చూశామని, జట్టు సబ్యులు అంతా ధోనిని గౌరవించేవాళ్ళమని తెలిపాడు. ఇక ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ ధోని చివరి మ్యాచ్ అని తాము అనుకోవట్లేదన్నాడు.
 
ఇటీవలే ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో అర్ధ సెంచరీతో అద్భుత ప్రదర్శనతో రాహుల్ మంచి ఫామ్ లో కనిపించాడు. భారత జట్టు తరపున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఈ టీ20 ప్రపంచకప్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఇక అక్టోబర్ 24న ఆదివారం జరగబోయే భారత్ - పాక్ మ్యాచ్ తో టీ20 ప్రపంచకప్ సమరాన్ని టీమిండియా మొదలుపెట్టనుంది.