ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్.. నలుగురు బుకీలు అరెస్ట్.. రూ.40 లక్షలు స్వాధీనం
సైబరాబాద్ పోలీసులు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించారు. ఈ క్రమంలో నలుగురు బుకీలను అరెస్ట్ చేశారు. అంతేగాకుండా రూ.3.57 లక్షల విలువైన ఐదు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడమే కాకుండా నిందితుల వద్ద నుంచి రూ.40 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
మాదాపూర్‌లోని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ), మియాపూర్ పోలీసులు సంయుక్తంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతృశ్రీ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి బుకీలను పట్టుకున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లపై క్రికెట్ లైవ్ గురు, లక్కీ ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన ఆలూరు త్రినాధ్, మానం రాజేష్, బొల్లె స్వామి, మార్పెన్న గణపతిరావులను అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన శాకమూరి వెంకటేశ్వర్‌రావు అలియాస్ చిన్ను అనే వ్యక్తి లండన్‌కు చెందిన వ్యక్తి ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అరెస్టయిన నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని.. అతని తరపున బుకీలుగా వ్యవహరించారు.
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించే బుకీలు, పంటర్లకు సంబంధించి పౌరులు 100కు డయల్ చేయడం ద్వారా లేదా వాట్సాప్ నంబర్ 9490617444 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని మాదాపూర్ జోన్ డీసీపీ జి.వినీత్ కోరారు.