శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (14:30 IST)

పాకిస్థాన్‌కు షాక్: క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన హఫీజ్

పాకిస్థాన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ హఫీజ్ రిటైర్మెంట్‌ ప్రకటించారు. 2018లో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌చెప్పిన ఆయన.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 18 ఏళ్ల పాటు పాక్‌ జట్టుకు సేవలు అందించిన ఈ ఆల్‌రౌండర్‌.. రిటైర్మెంట్‌ ఆ జట్టుకు పెద్ద షాకే అంటున్నారు క్రికెట్‌ విశ్లేషకులు.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రం ఆట కొనసాగించనున్నాడు హాఫీజ్‌. ఇక, హఫీజ్ టీ20 ప్రపంచ కప్‌లో పాక్‌ తరపున గత ఏడాది చివరి మ్యాచ్‌ ఆడాడు.. యూఏఈలో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే.
 
ఇప్పటి వరకు పాకిస్థాన్‌ జట్టు తరపున 55 టెస్ట్‌లు, 218 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు ఆడిన మహ్మద్‌ హఫీజ్.. తన కెరీర్‌లో 21 సెంచరీలు, 64 హాఫ్‌ సెంచరీలతో.. 12000 పైగా పరుగులు సాధించాడు. 2003లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హఫీజ్ 218 వన్డేలు ఆడి 11 సెంచరీలు, 38 అర్ధసెంచరీలతో సహా 6,614 పరుగులు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 139 వికెట్లు తీశాడు.. 119 టీ20ల్లో 2514 పరుగులు చేసి 61 వికెట్లు తీశాడు.