బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (13:38 IST)

రన్స్ - 0 ... వికెట్లు -10 : ఎవరా క్రికెటర్?

క్రికెట్ ప్రపంచంలో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఓ క్రికెటర్ ఒక్క రన్ కూడా ఇవ్వకుండా ఏకంగా పది వికెట్లు తీసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

క్రికెట్ ప్రపంచంలో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఓ క్రికెటర్ ఒక్క రన్ కూడా ఇవ్వకుండా ఏకంగా పది వికెట్లు తీసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్‌కు చెందిన 15 ఏళ్ల లెఫ్టామ్ మీడియం పేసర్ ఆకాశ్ చౌదరి.. స్థానికంగా ఉండే దిశా క్రికెట్ అకాడమీ తరపున ఆడుతున్నాడు. భావర్ సింగ్ టీ20 టోర్నీలో భాగంగా పెర్ల్ అకాడమీపై మొత్తం 10 వికెట్లను ఆకాశ్ నేలకూల్చాడు. 4 ఓవర్లు వేసిన ఆకాశ్.. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తొలి ఓవర్‌లో రెండు, ఆ తర్వాత రెండు ఓవర్లలో మరో రెండేసి వికెట్లు తీశాడు. ఇక చివరి ఓవర్‌లో ఓ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీశాడు. 
 
ఈమ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దిశా క్రికెట్ అకాడమీ 20 ఓవర్లలో 156 రన్స్ చేయగా.. పెర్ల్ అకాడమీ 36 పరుగులకే ఆలౌటైంది. అన్ని వికెట్లు ఆకాశ్ ఖాతాలోకే వెళ్లాయి. చివరికి ఆకాశ్ బౌలింగ్ ఫిగర్స్ ఇలా ఉన్నాయి... 4-4-0-10. 15 ఏళ్ల ఆకాశ్.. రాజస్థాన్ - ఉత్తరప్రదేశ్ బోర్డర్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందినవాడు.