బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (16:53 IST)

జడేజాపై మ్యాచ్ నిషేధం... ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌‌లో నం.1 ఆల్‌రౌండర్

మైదానంలో ప్రత్యర్థి క్రికెటర్ల పట్ల ప్రవర్తన సరిగాలేనికారణంగా భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవీంద్ర జడేజాపై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అయితే, ఐసీసీ మంగళవారం ప్రకటించిన ఐసీసీ ర్యాంకుల పట్టికలో

మైదానంలో ప్రత్యర్థి క్రికెటర్ల పట్ల ప్రవర్తన సరిగాలేనికారణంగా భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవీంద్ర జడేజాపై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అయితే, ఐసీసీ మంగళవారం ప్రకటించిన ఐసీసీ ర్యాంకుల పట్టికలో ఆల్‌రౌండర్ విభాగనంలో జడేజా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు.
 
ఇటీవ‌ల జ‌రిగిన కొలంబో టెస్ట్‌, గాలే టెస్టులు ర‌వీంద్ర జ‌డేజా మెరుగైన ర్యాంకును చేరుకునేందుకు దోహ‌ద‌ప‌డ్డాయి. జ‌డేజా నెం.1 స్థానాన్ని చేరుకోవ‌డం త‌న కెరీర్‌లో ఇదే మొద‌టిసారి. 438 పాయింట్ల‌తో జ‌డేజా మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, 431 పాయింట్ల‌తో షాకిజ్ రెండో స్థానంలో, 418 పాయింట్ల‌తో మ‌రో భార‌త ఆట‌గాడు అశ్విన్ మూడో స్థానంలో నిలిచారు. 
 
అలాగే, బ్యాటింగ్ ర్యాంకుల్లో మొద‌టి స్థానంలో స్టీవ్ స్మిత్‌, రెండో స్థానంలో జోయి రూట్‌, మూడో స్థానంలో చ‌టేశ్వ‌ర్ పూజారాలు నిలిచారు. విరాట్ కొహ్లీ ఐదో స్థానంలో, అజింక్య రెహానే ఆరో స్థానంలో ఉండ‌గా జ‌డేజా తొమ్మిదో ర్యాంకును ద‌క్కించుకున్నాడు. 
 
ఇక బౌల‌ర్ ర్యాంకింగ్‌లో జ‌డేజా మొద‌టి ర్యాంకు సాధించ‌గా జేమ్స్ ఆండ‌ర్స‌న్‌, అశ్విన్‌లు త‌ర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇత‌ర భార‌త బౌల‌ర్లు మ‌హ్మ‌ద్ ష‌మీ, ఉమేశ్ యాద‌వ్‌లు వ‌రుస‌గా 20, 22 ర్యాంకుల్లో నిలిచారు.