మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (10:12 IST)

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ ఇకలేరు

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఆ జట్టు మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ ఇకలేరు. 74 యేళ్ళ ఆయన గుండెపోటుతో మృతి చెందారు. గతంలో ఓ చారిటీ మ్యాచ్ సందర్భంగా గుండెపోటు రాగా, అప్పటినుంచి అడిలైడ్‌లోని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు.
 
ఈయన ఆస్ట్రేలియా క్రికెట్ టెస్ట్ జట్టు తరపున తొలి సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా రికార్డుపుటల్లో తన పేరును లిఖించుకున్నారు. 1970 ఆస్ట్రేలియా తరపున మొదటి మ్యాచ్ మార్ష్... 1984లో రిటైర్ అయ్యారు. మొత్తం 96 టెస్టు మ్యాచ్‌లు ఆయన 355 వికెట్ల భాగస్వామ్యంతో రికార్డు నెలకొల్పాడు. అందులో 95 లెజండరీ పేస్ బౌలర్ డెన్నిస్ లిల్లీ బౌలింగ్‌లోనే కావడం గమనార్హం.