శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (22:33 IST)

జిమ్ డ్రెస్సులో సారా టెండూల్కర్.. ఫోటోలు వైరల్ (Video)

Sara Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోను అప్‌లోడ్ చేసింది. జిమ్ డ్రెస్సులో ఉన్న ఫోటోను పోస్టు చేసిన సారా టెండూల్కర్ తానెందుకు ఆ డ్రెస్సు వేసుకోవాల్సి వచ్చిందో తెలిపింది. తన ఫ్రెండ్ ఓ కొత్త క్రీడా దుస్తుల షాపును ఓపెన్ చేసిందని, దానిలో భాగంగానే ఆ డ్రెస్సు వేసుకున్నట్లు సారా తన పోస్టులో చెప్పింది.
 
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌, కార్తిక్ ఆర్యన్‌లు ఆ ఫోటోకు అప్పుడే లైక్‌లు కూడా కొట్టేశారు. చాలా స్టయిలిష్‌గా, రిలాక్స్‌గా ఉన్న ఆ ఫోటోకు మిలియన్ల సంఖ్యలో లైక్‌లు వస్తున్నాయి. సారా టెండూల్కర్ స్టయిల్ చాలా కొత్తగా ఉన్నట్లు కొందరు కామెంట్ చేస్తున్నారు. 
 
సుమారు మూడు వేల మంది కామెంట్ కూడా చేశారు. ఫిట్‌నెస్‌ను ఇష్టపడే టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్ కూడా సారా పోస్టుపై కామెంట్ చేసింది. 23 ఏళ్ల సారా ఇప్పుడు ఫ్యాషన్ లోకానికి కొత్త ట్రెండ్ అయ్యారు. ఇన్‌స్టాలో అద్భుతమైన ఫోటోలను పోస్టు చేస్తున్న ఆమె.. సోషల్ మీడియా లవర్స్‌ను తెగ అట్రాక్ట్ చేస్తుంది.