శుక్రవారం, 12 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మార్చి 2024 (13:06 IST)

బీసీసీఐ ప్రసన్న కోసం ఐపీఎల్‌కు దూరం కానున్న శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆదేశాలను ధిక్కరించి, బోర్డు పెద్దల ఆగ్రహానికి గురైన భారత యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ మెత్తబడ్డాడు. బోర్డు పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు తనవంతు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఇటీవల తనను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన బీసీసీఐ పెద్దలను శాంతింపజేయాలని భావిస్తున్నాడు. ఇందుకోసం శ్రేయాస్... ప్రత్యమ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాడా? అంటే ఔననే వార్తలు వస్తున్నాయి. 
 
త్వరలో జరుగనున్న పొట్టి ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్ శస్త్రచికిత్స తర్వాత నొప్పి నివారణ కోసం మూడు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకున్నాడని తెలిపింది. రంజీ సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ సమయంలో నొప్పి తిరిగి బాధ పెట్టినా అందుబాటులోనే ఉంటాడని అయ్యర్ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం. 
 
ప్రపంచ కప్ తర్వాత విరామం దక్కని ఏకైక ఆటగాడు అయ్యర్ అని సదరు వ్యక్తి చెప్పినట్టు ప్రస్తావించింది. 'వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్, ఆ తర్వాత దక్షిణాఫ్రికా టూర్, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్టులు ఆడాడు. ఒక ఆటగాడికి అతడికి నచ్చిన కోచ్ శిక్షణ పొందే స్వేచ్ఛ లేదా?' అని సదరు వ్యక్తి పేర్కొన్నట్టు తెలుస్తుంది. క్రమంగా పని భారాన్ని పెంచుకోవడం కోసం అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ అకాడమీకి వెళ్లాడని సన్నిహిత వ్యక్తి పేర్కొంటున్నాయి. 
 
'ఒక సెషన్‌‍లో 60 బంతులు ఆడిన తర్వాత అయ్యర్ నొప్పికి గురయ్యాడు. కాస్త ఇబ్బంది పడిన తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం సెషన్‌కు 200 బంతులు ఆడుతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్, ముంబై జట్టు ప్రధాన కోచ్ ఓంకార్ సాల్వి ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాడు. అయ్యర్ పురోగతిని తెలుసుకునేందుకు ఓంకార్ సాల్వి చాలాసార్లు కోల్‌కతా నైట్ రైడర్స్ అకాడమీని సందర్శించారని సదరు వ్యక్తి పేర్కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.