మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

రెండో ట్వంటీ20లో భారత్ గెలుపు - సిరీస్ కైవసం

భారత క్రికెట్ జట్టు మరో విజయం సాధించింది. స్వదేశంలో పర్యాటక శ్రీలంక జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ ఆదివారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరుగనుంది. మరోవైపు, ఇది భారత జట్టుకు వరుసగా ఎనిదో విజయం కావడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఓపెనర్ నిశ్శంక 53 బంతుల్లో 11 ఫోర్లతో 75 పరుగులతో చెలరేగడానికితోడు మ్యాచ్ ఆఖరులో కెప్టెన్ షనక 19 బంతుల్లో రెండో ఫోర్లు, ఐదు సిక్సర్లతో వీర విహారం చేసి 47 పరుగులు చేయడంతో మొత్తం 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 184 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మరో 17 బంతులు మిగిలివుండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇది భారత్‌కు వరుసగా ఎనిమిదో విజయం కాగా, కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది వరుసగా ఎనిమిదో విజయం కావడం గమనార్హం. 
 
ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయినప్పటికీ మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (16) పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 44 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అలాగే సంజు శాంసన్‌ కూడా 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు, రవీంద్ర జడేజా 18 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 45 పరుగులు చేయడంతో అపురూప విజయాన్ని అందించాడు. బ్యాటింగులో ఇరగదీసిన శ్రేయాస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.