సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (21:36 IST)

ఉక్రెయిన్ నుంచి భారత్‌కు చేరుకున్న తొలి విమానం

ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధ భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ దేశాన్ని రష్యా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో వేలాది మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిలో అనేక మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. 
 
ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, తాజాగా 219 మందితో ఉక్రెయిన్ నుంచి సరిహద్దు రొమేనియా నుంచి శనివారం మధ్యాహ్నం బయలుదేరిన ఎయిరిండియా విమానం శనివారం రాత్రి ముంబైకు సురక్షితంగా చేరింది. ఈ విమానంలో వచ్చిన విద్యార్థులకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్వాగతం పలికారు. 
 
కాగా, భారత విదేశాంగ శాఖ సూచనలను అనుసరిస్తూ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల్లో 219 మంది రొమేనియా సరిహద్దులు చేరుకున్నారు. వీరిని అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన ఎయిరిండియా విమానంలో ఎక్కించారు. ఆ వెంటనే టేకాప్ తీసుకున్న విమానం సురక్షితంగా ముంబైకు చేరుకుంది. యుద్ధ నేపథ్యంలో భీతావహ పరిస్థితులను కళ్లారా చూసిన భారత విద్యార్థులు ముంబైకి చేరుకోగానే ఊపిరి పీల్చుకున్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.