ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మే 2023 (20:51 IST)

శుభ్‌మన్ గిల్‌పై ట్రోలింగ్.. నీ జీవితంలో అన్నీ అపశకునాలే

Gill
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులు కొందరు ఓటమిని తట్టుకోలేక జుగుప్సాకరమైన ట్రోలింగ్‌కు దిగారు. ఆటగాళ్లను కాకుండా అసాధారణ ప్రదర్శన కనబర్చిన ప్రత్యర్థి ఆటగాడిని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. అతని చావును కోరడమే కాకుండా కుటుంబ సభ్యులపై కామెంట్లు చేశారు. 
 
ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. శుభ్‌మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్‌ను తట్టుకోలేకపోయిన కొంతమంది సైకో ఫ్యాన్స్.. అతన్ని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. 
 
"శుభ్‌మన్ గిల్.. నువ్వు, నీ ట్రాన్స్‌జెండర్ సోదరి తలలు తెగిపడాలి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో.. నీ జీవితంలో అన్నీ అపశకునాలే. ఆ మేరకు నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. నీ కంట్లోంచి కారే ప్రతి కన్నీటి బొట్టుకు నా శాపమే కారణం." అని శాపనార్థాలు పెట్టారు.