శుక్రవారం, 14 జూన్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జూన్ 2023 (16:34 IST)

కోహ్లీ అలా చేస్తాడనుకోలేదు.. కెప్టెన్సీకి రోహితే బెస్ట్ ఆప్షన్.. దాదా

ganguly
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దాదా కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. 
 
అలాగే టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని గంగూలీ వ్యాఖ్యానించాడు. కోహ్లి అలా చేస్తాడని అనుకోలేదని గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
అంతేకాదు వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ గెలవడమే కష్టమని కూడా దాదా చెప్పడం విశేషం. విరాట్ కోహ్లి స్థానంలో కెప్టెన్సీకి రోహితే బెస్ట్ ఆప్షన్ అని కూడా గంగూలీ స్పష్టం చేశాడు.