మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మే 2024 (20:47 IST)

ఐపీఎల్ 2024 ఫైనల్ : సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ల పతనం..

srh vs kkr
ఐపీఎల్ 2024 సీజన్ అంతిమ పోరాటం చెన్నైలోని చెప్పాకంలో ఆదివారం రాత్రి జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆ జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టినప్పటికీ వరుసగా టిక్కెట్లు కోల్పోతుంది. ఫలితంగా 12.4 ఓవర్లలోనే 77 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. 
 
ఆ జట్టులో అభిషేక్ శర్మ 2, ట్రవిడ్ హెడ్ 0, రాహుల్ త్రిపాఠి 9, మార్‌క్రమ్ 20, నితీశ్ కుమార్ రెడ్డి 13, అబ్దుల్ సమద్ 4, అహ్మెద్ 8 చొప్పున పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్ల ధాటికి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. కాగా, ఈ టోర్నీల సన్ రైజర్స్ జట్టు తొలి బ్యాటింగ్ ఎంచుకుని విధ్వంసం సృష్టించినన విషయం తెల్సిందే. ఈ పంథానే ఫైనల్‌లో కూడా అనుసరించి, కానీ, కోల్‌‍కతా బౌలర్ల ముందు ఆ జట్టు ఆటగాళ్లు తలొగ్గారు. ఫలితంగా వరుసగా వికెట్లను కోల్పోయింది. 
 
అంతకుముందు ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
సన్ రైజర్స్ హైదరాబాద్ : పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిడ్ హెడ్, అభిషేక్ వర్మ, రాహుల్ త్రిపాఠి, మార్కమ్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, టి.నటరాజన్
 
కోల్‌కతా నైట్ రైడర్స్... 
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్య్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, రమణ్ దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. 
 
ఐపీఎల్ 2024 : ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డొస్తే టైటిల్ ఎవరికి సొంతం?
 
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్ హైదరాబాద్ జట్ల మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే మరికొన్ని గంటల్లోనే ఆరంభంకానున్న ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగింవచ్చని వాతావరణ శాఖ రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. చెపాక్ స్టేడియంలో పగటిపూట వర్షం పడే అవకాశం దాదాపు 47 శాతంగా ఉందని, అయితే సాయంత్రానికి ఈ అవకాశం 32 శాతానికి తగ్గుతుందని వెదర్ డాట్ కామ్ రిపోర్ట్ అప్రమత్తం చేసింది. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి బీసీసీఐ కూడా తగు చర్యలు తీసుకుంది.
 
గతంలో వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో లీగ్ దశ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు కాబట్టి మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. అయితే ఫైనల్ సహా ఇతర ప్లే ఆఫ్ మ్యాచ్‌కు రిజర్వ్ డే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డేగా ఉన్న సోమవారానికి మ్యాచ్ వాయిదా పడుతుంది. 
 
రిజర్వ్ డే నాడు 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఒక వేళ వర్షం ఆటంకం కలిగిస్తే 5-5 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అవసరమైతే డక్ వర్త్-లూయిస్ విధానాన్ని కూడా ఉపయోగిస్తారు. అయితే వర్షం కారణంగా రిజర్వ్ డే కూడా మ్యాచ్ పూర్తిగా రద్దైతే పాయింట్ల పట్టికలో జట్ల ర్యాంకింగ్స్ కీలకమవుతాయి. ఈ సమీకరణంలో అగ్రస్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ట్రోఫీని ఎగరేసుకుపోతుంది. లీగ్ దశలో నంబర్-2లో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.