మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (14:41 IST)

శ్రీలంక క్రికెటర్ డిసిల్వ తండ్రి హత్య.. కాల్పులు జరిపి పారిపోయారు..

శ్రీలంక క్రికెటర్ ధనంజయ డిసిల్వ(26) తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో సిల్వ తండ్రి రంజన్ సిల్వ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన శ్రీలంకలో కలకలం ర

శ్రీలంక క్రికెటర్ ధనంజయ డిసిల్వ(26) తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో సిల్వ తండ్రి రంజన్ సిల్వ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన శ్రీలంకలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ధనంజయ డిసిల్వ(26) తండ్రి రంజన్‌ డిసిల్వపై దుండగులు గురువారం అర్థరాత్రి దాడిచేశారు. ఈ క్రమంలో రంజన్‌ డిసిల్వ తప్పించుకునే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 
 
కాల్పులు జరిపిన దుండగులు పరారీలో వున్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో రంజన్‌ డిసిల్వ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ధనంజయ్ తండ్రి రంజన్.. స్థానికంగా ఓ రాజకీయ నేత కావడంతో శత్రువులెవరైనా ఈ పని చేసివుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తండ్రి దుర్మరణంతో శుక్రవారం వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనంజయ డిసిల్వ తప్పుకున్నాడు.