మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (18:44 IST)

రీచార్జ్ కోసం విహారయాత్రకు వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు!!

hyd sun risers
ఐపీఎల్ సీజన్‌లో భాగంగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఇపుడు మిగిలిన ఐదు మ్యాచ్‌లలో ఆ జట్టు విజయం సాధించాల్సివుంది. ఈ నేపథ్యంలో జట్టు సభ్యుల్లో నూతనోత్తేజం పొందేందుకు వీలుగా ఆ జట్టు యజమానురాలు కావ్య మారన్.. జట్టు సభ్యులను మాల్దీవులకు విహార యాత్రకు పంపించారు. సన్ రైజర్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. 
 
దీంతో కాస్త సేద తీరేందుకు మాల్దీవులకు పయనమైంది. ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ మేరకు 35 సెకన్ల వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆటగాళ్లు మాల్దీవుల్లో తమ విరామాన్ని ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌కు మరికొన్ని రోజుల సమయం ఉండటంతో తమ ఆటగాళ్లు రీచార్జ్ అయ్యేందుకు ఈ వెకేషన్ ఉపకరిస్తుందని సన్ రైజర్స్ టీమ్ యాజమాన్యం భావిస్తుంది. 
 
కాగా, సన్ రైజర్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే పాట్ కమిన్సన్ సారథ్యంలోని జట్టు తమ తదుపరి ఐదు మ్యాచ్‌‍లలోనూ తప్పక గెలవాల్సిన క్లిష్ట పరిస్థితి నెలకొంది. ఏ ఒక మ్యాచ్‌‍లో ఓడినా ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి. సన్ రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ను మే 2వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ఆడనుంది.