శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (12:42 IST)

టీమిండియా డ్యాన్సింగ్ క్రికెటర్ శ్రీశాంత్‌కి ఊరట...

2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడుతూ పట్టుబడిన టీమ్ ఇండియా క్రికెటర్ శ్రీశాంత్‌. ఈయనకు సుప్రీంకోర్టులో ఎట్టకేలకు ఊరట లభించింది. ఈయనపై భారత క్రికెట్ కంట్రోలో బోర్డు (బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్నిసుప్రీంకోర్టు ఎత్తివేసింది. 
 
జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో ఈ కేసును విచారించిన బెంచీ, శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం చాలా కఠినమైన శిక్షగా అభివర్ణిస్తూ అతనిపై నిషేధం విషయంలో మూడు నెలలలోపు తాజాగా మరో నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించింది.
 
టీమ్ ఇండియా తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ-20 మ్యాచులు ఆడిన శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ నేరానికిగానూ... బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. అంతేకాక.. ఇటీవల హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొన్న శ్రీశాంత్ ఆ సీజన్ రన్నరప్‌గా నిలిచాడు.