మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మార్చి 2025 (15:59 IST)

Tamim Iqbal: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు..

tamim iqbal
ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు వచ్చింది. ఆయనను రాజధాని ఢాకా శివార్లలోని సావర్‌లోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో  వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
 
ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా మహమ్మదన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌, షినెపుకర్‌ క్రికెట్‌ క్లబ్‌ల మధ్య మ్యాచ్ నిర్వహించారు. ఇందులో భాగంగా టాస్ కోసం మహమ్మదన్ క్లబ్‌ కెప్టెన్‌ తమీమ్ గ్రౌండ్‌లోకి వచ్చాడు.  ఆ సమయంలోనే అతడికి ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. 
 
ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. బంగ్లా తరఫున 70 టెస్టులు, 78 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు తమీమ్. 243 వన్డే మ్యాచ్‌లు ఆడి 8,357 పరుగులు చేశాడు. ఈ ఏడాది జనవరిలో తమీమ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తమీమ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.