గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (13:16 IST)

సామర్థ్యం ఉంది.. కానీ చిత్తుగా ఓడాం... ఉపుల్ తరంగ

తమ క్రికెట్ జట్టులోని సభ్యులందరికీ పూర్తి సామర్థ్యం ఉందనీ కానీ మైదానంలో దాన్ని ప్రదర్శించలేక చిత్తుగా ఓడినట్టు శ్రీలంక జట్టు కెప్టెన్ ఉపుల్ తరంగ తెలిపారు. స్వదేశంలో పర్యాటక భారత జట్టుతో జరిగిన టెస్ట్,

తమ క్రికెట్ జట్టులోని సభ్యులందరికీ పూర్తి సామర్థ్యం ఉందనీ కానీ మైదానంలో దాన్ని ప్రదర్శించలేక చిత్తుగా ఓడినట్టు శ్రీలంక జట్టు కెప్టెన్ ఉపుల్ తరంగ తెలిపారు. స్వదేశంలో పర్యాటక భారత జట్టుతో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో శ్రీలంక జట్టు చిత్తుగా ఓడిన విషయం తెల్సిందే. 
 
దీనిపై ఉపుల్ తరంగ స్పందిస్తూ... జట్టులో స్థిరత్వం లేకపోవడంతో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో పూర్తిగా విఫలమయ్యామని తెలిపాడు. దానికి తోడు ఫీల్డింగ్‌‌లో ఏమాత్రం నాణ్యత లేకపోవడంతో ఓటమిపాలయ్యామన్నాడు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నానని చెప్పాడు. 
 
తాము ఇంత దారుణంగా విఫలం కాగా, టీమిండియా అద్భుతంగా ఆడిందని అన్నాడు. టీమిండియాలో స్థిరత్వం ఉందని చెప్పాడు. టాప్ ఆర్డర్స్ బ్యాట్స్ మన్ పరుగుల వరదపారించారని చెప్పాడు. సామర్థ్యం ఉన్నప్పటికీ విఫలం కావడం తనను కలచివేస్తోందని ఉపుల్ తరంగ తెలిపాడు.