కరోనా లేదూ కాకరకాయ లేదూ... ఐపీఎల్ రీషెడ్యూల్ ప్రకటించే ఆలోచన చేస్తున్నారట
ఐపీఎల్ - 14 సీజన్ నిరవధికంగా వాయిదా పడడంతో ఇప్పుడు రీ షెడ్యూల్ కోసం బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. అయితే 10 రోజుల వ్యవధిలో ఐపీఎల్‌ను జరపాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందట. ఈ రోజు జరిగిన బీసీసీఐ గవర్నింగ్ సమావేశంలో ఇదే విషయంపై చర్చించిన తర్వాత ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ముంబై వేదికగా ఎంచుకుని మొత్తం మిగిలిన సీజన్‌ను జరపాలని చూస్తోంది. ముంబైలో మూడు క్రికెట్ స్టేడియాలు ఉండటంతో వాటిలోనే మిగిలిన సీజన్‌ను జరపాలని భావిస్తోంది.
బాంబే జింఖానా గ్రౌండ్, బ్రబోర్న్ స్టేడియం, వాంఖడే స్టేడియాలు ముంబైలో ఉన్నాయి. ఇక రెండో ఆప్షన్‌గా కరోనా తగ్గుముఖం పట్టాక జూన్‌లో లేదా మూడో ఆప్షన్‌గా యూఏఈలో ఐపీఎల్ నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి.