మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (17:31 IST)

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్- సచిన్ రికార్డ్ బ్రేక్.. 6000 పరుగులతో కోహ్లీ అదుర్స్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా భారత జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. మూడో టెస్ట్‌లో అద్భుతంగా ఆడి విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంలో భారత జట్టు అటు బ్యాంటింగ్ ఇటు బౌలింగ్ విభ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా భారత జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. మూడో టెస్ట్‌లో అద్భుతంగా ఆడి విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంలో భారత జట్టు అటు బ్యాంటింగ్ ఇటు బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి ఈ విజయాన్ని కైవసం చేసుకుంది.


దీంతో కోహ్లీ సేన గురువారం మొదలైన నాలుగో టెస్ట్‌ను రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించింది. ఈ టెస్టులో కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటివరకు చేయని ప్రయోగం చేసి మంచి ఫలితాన్ని సాధించారు.
 
కోహ్లీ ఇప్పటివరకు టీం ఇండియా ఆడిన 38 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్ గా వ్యవహరించారు. అయితే అతడు ఆడిన ఏ  టెస్ట్ మ్యాచ్‌లోనూ టీంలో కనీసం ఒక్కటైనా మార్పుండేది. కానీ ఈ టెస్టులో మాత్రం ఒక్క మార్పు కూడా లేకుండానే బరిలోకి దిగింది. మూడో టెస్టులో ప్రతి ఒక్కరి ఆటతీరుతో భారత్ గెలుపును నమోదు చేసుకోవడంతో అదే టీమ్‌ను కొనసాగించారు. ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కొత్త ప్రయోగం మంచి ఫలితాన్నిచ్చింది. 
 
అలా బరిలోకి దిగిన మూడో టెస్టులో ఆడిన జట్టునే నాలుగో టెస్టులో యధావిధిగా కొనసాగించారు. ఈ ప్రభావం తొలి రోజే కనిపించింది. ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నా బారత బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయింది. దీంతో కేవలం 246 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యింది. అయితే టీం ఇండియా గురువారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.  
 
ఇలా కోహ్లీ తన కెప్టెన్సీ కెరీర్ లో కొత్త ప్రయోగాన్ని చేసి మంచి పలితాన్ని పొందుతుండటంతో అతడిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో మరో మైలు రాయిని సాధించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌‍లో మాస్టర్ బ్లాస్టర్ 121 ఇన్నింగ్స్‌ల్లో 6వేల పరుగుల రికార్డును కోహ్లీ 119 ఇన్నింగ్స్‌లతో బ్రేక్ చేశాడు. దీంతో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్లలో రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో 117 ఇన్నింగ్స్‌లో సునీల్ గవాస్కర్ కొనసాగుతున్నాడు.