శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (14:58 IST)

శిఖర్ ధావన్‌కు హెడ్ మసాజ్ చేసిన విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికా పర్యటనలో చివరి ట్వంటీ20 మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో ఖాళీ ఎందుకు ఉండాలనుకున్నాడో ఏమోగానీ..

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికా పర్యటనలో చివరి ట్వంటీ20 మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో ఖాళీ ఎందుకు ఉండాలనుకున్నాడో ఏమోగానీ... జట్టు సభ్యులకు హెడ్ మసాజ్ చేస్తూ బిజీ అయిపోయాడు. 
 
సౌతాఫ్రికా పర్యటనను కోహ్లీ సేన విజయవంతంగా ముగించింది. టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన వన్డే, ట్వంటీ20 సిరీస్‌లలో విజయభేరీ మోగించింది. ఈ సిరీస్ మొత్తం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా టీమ్‌ను ముందుండి నడిపించాడు. 
 
కానీ, మోకాలికి గాయం కారణంగా చివరి టీ20కి దూరమయ్యాడు. అయితే ఖాళీగా ఉండటం ఎందుకని.. ఈ మ్యాచ్‌లోనూ ఫిజియో పని చేశాడతడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్‌కు హెడ్ మసాజ్ చేస్తూ కనిపించాడు. ఫీల్డ్ లోపల, బయట కోహ్లి, ధావన్ మధ్య మంచి కెమెస్ట్రీ ఉన్న విషయం తెల్సిందే.