గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2023 (15:31 IST)

విరాట్ కోహ్లీ కోసం వచ్చాను.. పాక్ అభిమాని బుగ్గలను చూపెట్టి..?

Pak fan
Pak fan
ఆసియా కప్ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ సందర్భంలో భారత జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీని పాక్ అభిమాని పొగిడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం ఇండో-పాక్ మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు స్టేడియం నుంచి బయటకు వచ్చారు. అనంతరం ఇరు దేశాల అభిమానులను మీడియా ఇంటర్వ్యూ చేసింది. 
 
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ "నా ఫేవరెట్ ప్లేయర్" అని ఓ పాక్ అభిమాని చెప్పింది. "నేను ఆయన వీరాభిమానిని. ఆయన్ని చూడాలని ఇక్కడికి వచ్చాను. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తాడని అనుకున్నాను. కానీ అది జరగలేదు. అయితే ఆయన్ను చూడడం ఆనందంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చింది. 
 
ఇంకా పాకిస్థాన్‌కు చెందిన మీరు కోహ్లీకి మద్దతు ఇస్తున్నారా అనే ప్రశ్నకు ఆమె సమాధానం కూడా ఇచ్చింది. ఇంకా ఆ యువతి చెంప చూపించింది. అందులో ఒక చెంపపై పాకిస్థాన్ జెండా, మరో చెంపపై భారత జాతీయ జెండాను చిత్రించారు. మన పొరుగువారిని ప్రేమించడం తప్పుకాదని యువతి బదులిచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.