ప్లీజ్ హెల్ప్ మి!: విరాట్ కోహ్లీ ఇబ్బందులు, మాస్టర్ సచిన్ సాయం
ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్న భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సలహాలిస్తున్నాడు. సాయం చేయాలంటూ సచిన్‌ను కోరిన కోహ్లీ ఈ మేరకు ముంబైకి వచ్చాడు. ముంబై క్రికెట్ సంఘం ఇండోర్ నెట్స్‌లో సచిన్ సమక్షంలో కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా సచిన్ పలు విలువైన సూచనలు చేశాడు. ఆఫ్ స్టంప్ పైన పడే బంతులను ఎదుర్కోవడంపై విరాట్ దృష్టి పెట్టాడు. సమాచారం మేరకు.. సచిన్ టెండుల్కర్‌కు కోహ్లీ ఫామ్ లేమితో బాధపడుతున్న తనకు సహకరించాలని ఓ మెసేజ్ పంపించాడు. ముంబైకి వచ్చిన కోహ్లీకి అతని బ్యాటింగ్ దోషాలను చెబుతూ సచిన్ సూచనలు ఇస్తున్నాడంటున్నారు.