ముందే చెప్పి మరీ కోహ్లీ పనిపట్టిన అమీర్.. టీమిండియా మైండ్ గేమ్‌తోనే కుప్పగూలిందా?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దాయాది పాకిస్తాన్ జట్టుపై అనూహ్యంగా చిత్తయిపోయిన టీమిండియా మైదానంలోకి అడుగుపెట్టకముందే పాక్ బౌలర్లు ఆడిన మైండ్ గేమ్‌కు ముందస్తుగానే బలైపోయిందా? అంటే అవుననిపిస్తోంది. ఆటమొదలు కాకముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పని పట్ట
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దాయాది పాకిస్తాన్ జట్టుపై అనూహ్యంగా చిత్తయిపోయిన టీమిండియా మైదానంలోకి అడుగుపెట్టకముందే పాక్ బౌలర్లు ఆడిన మైండ్ గేమ్‌కు ముందస్తుగానే బలైపోయిందా? అంటే అవుననిపిస్తోంది. ఆటమొదలు కాకముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పని పట్టడమే నా తొలి లక్ష్యమని పాక్ ఫేసర్ మహమ్మద్ అమీర్ హెచ్చరించాడు. అతనికి తోడుగా మరొక ఫేసర్ జునైద్ ఖాన్ కోహ్లీ నా బౌలింగులో పద పరుగులు కూడా చేయకుండా వెనుదిరగాడని, చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే జరుగుతుందని మాటల యుద్ధం మొదలెట్టేశాడు.
కానీ వాస్తవానికి పాక్ ఒక కోహ్లీనే కాకుండా టీమిండియా టాపార్డర్‌ను వీలైనంత త్వరగా చాప చుట్డడమే లక్ష్యంగా పెట్టుకుని మరీ వచ్చిందని ఆట ముగిశాక అర్థమవుతోంది. ఎందుకంటే గత పదేళ్లలో టీమిండియా ఇంత ఘోరంగా పేస్ బౌలింగుకు బలి కావడం ఇదే తొలిసారి. టాపార్డర్‌ను చాపచుట్టేయడం అనే ప్లాన్‌ను పాక్ టీమ్ అద్భుతంగా అమలు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య ఆదివారం ఫైనల్ జరగనున్న ఈ నేపథ్యంలో ఆమిర్ మాట్లాడుతూ.. సారథిగా తొలి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ ఆడుతోన్న విరాట్ కోహ్లీపైనే ఒత్తిడి అధికంగా ఉంటోందన్నారు. అతన్ని వీలైనంత త్వరగా పెవిలియర్ బాట పట్టించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమిర్ తెలిపాడు. కోహ్లీ వికెట్ తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా అమిర్ తెలిపాడు.
సరిగ్గా అమీర్ తాను చెప్పిన విధంగా తొలి ఓవర్లో రోహిత్ శర్మ పనిపట్టాడు. మూడో ఓవర్‌లో విరాట్ కోహ్లీకి అద్భుతమైన బంతిని సంధించి 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీని ఔట్ చేశాడు. మూడు ఓవర్లలో 7 పరుగులకు టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోవడం దానికి కోలుకోలేని దెబ్బ అయింది. టోర్నీలో భాగంగా తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయిన ఆమిర్.. లంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టడమే కాక 28పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అదే ఎ
టాకింగ్‌ను టీమిండియాపై కూడా సంధించి పాక్‌కు మర్చిపోలేని విజయం సాధించిపెట్టాడు.
‘మేం ఇంగ్లాండ్ వెళ్తున్నది కేవలం భారత్‌ను ఓడించడానికి మాత్రమే కాదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకోవడానికి!’ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ జట్టు ఛీప్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ ఈ మాటలు చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మివుండరు. కోహ్లీసేనపై తొలి మ్యాచ్‌లో 124 పరుగుల తేడాతో చిత్తైనప్పుడు పాక్ ఆశలు దాదాపు ఆవిరైపోయాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాణించింది దాయాది జట్టు.
ఏ జట్టుపై పాకిస్తాన్ జట్టు చిత్తుగా ఓడిందో అదే భారత జట్టుపై అంతిమ సమరంలో 180 పరుగుల తేడాతో అపూర్వ విజయం సాధించింది. తొలిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఐసీసీ మూడు ప్రపంచ టైటిళ్లను నెగ్గిన వెస్టిండీస్, భారత్, శ్రీలంక సరసన నిలిచింది.