గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 డిశెంబరు 2022 (20:31 IST)

మైనర్ బాలికను 12 గంటలపాటు నిర్బంధించి 8 మంది గ్యాంగ్ రేప్

rape
మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. ఓ మైనర్ బాలికను మొత్తం 8 మంది యువకులు సామూహిక అత్యాచానికి పాల్పడ్డారు. 12 గంటల పాటు బాలికను నిర్బంధించిన అత్యంత దారుణంగా సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
ఈ బాలికను శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు బాలికను నిర్బంధించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న ఆ బాలిక... శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సత్పతి పోలీసులు కేసు నమోదు చేసి ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిపై ఫోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.