మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (11:23 IST)

కుక్క పిల్లల చెవులు, తోకలను కోసి వైన్‌లో నంజుకుని తిన్నారు..

Black Dogs
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జంతు హింసకు పాల్పడే ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ స్థితిలో బరేలీకి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో 2 కుక్క పిల్లల చెవులు, తోకలను కోసి చంపిన ఘటన జంతు సంక్షేమ బోర్డును కలచివేసింది. 
 
ఘటనకు పాల్పడిన వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించాడు. తర్వాత పక్కనే ఉన్న 2 కుక్క పిల్లలను పట్టుకుని చెవులు కోసేశాడు. అప్పుడు అతను తోకను కూడా కోసేశాడు. ఆ తర్వాత కుక్కపిల్ల చెవులకు, తోకకు ఉప్పు రాసి దానిని వైన్‌లో ముంచి తిన్నారు. 
 
దీన్ని చూసిన స్థానికులు జంతు సంక్షేమ బోర్డుకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన చేరుకుని తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్న కుక్క పిల్లలను రక్షించి పశువైద్యశాలకు తరలించారు. 
 
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కుక్క పిల్లలను కిరాతకంగా హింసించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు.