బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (16:48 IST)

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఆది సాయి కుమార్ టాప్ గేర్

Adi Saikumar, Rhea Suman
Adi Saikumar, Rhea Suman
వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు టాప్ గేర్ అంటూ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. కె. శశికాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్  బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో  K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు.
 
భారీ బడ్జెట్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందేలా రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. అందమైన లొకేషన్స్ లో షూట్ కంప్లీట్ చేశారు. గత కొన్ని రోజులుగా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్ 18న రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 30న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
 
ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ చేప్పట్టిన మేకర్స్ టాప్ గేర్ సినిమాకు సంబంధించి కొన్ని అప్ డేట్స్ వదిలి సూపర్ రెస్పాన్స్ అందుకున్నారు. టాప్ గేర్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా సిధ్ శ్రీరామ్ పాడిన వెన్నెల పాట, చిత్ర టీజర్.. ఇలా అన్నీ కూడా ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకోవడంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.    
 
గతంలో ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి. చిత్రయూనిట్ మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందించారు. టీజర్ చాలా బాగా కట్ చేశారని, టీజర్ చూస్తుంటేనే ఈ సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థమవుతోందని చెబుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎన్నో హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన సాయి శ్రీరామ్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించారు.  
 
ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లోకంలో అంచనాలు నెలకొన్నాయి.