టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్
టెక్ సిటీగా గుర్తింపుపొందిన బెంగుళూరు నగరంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఇంట్లోని విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఈ కామాంధులు మహిళను బెదిరించి అత్యాచారం చేయడంతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, రూ.25 వేల నగదును చోరీ చేశారు. ఈ దోపిడీ ముఠా నుంచి తప్పించుకున్న బాధితురాలి పెద్ద కుమారుడు పోలీసులకు సమాచారం చేరవేయడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు నగర శివారు ప్రాంతమైన గంగొండనహళ్లిలోని ఓ ఇంట్లో బెంగాల్‌కు చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉంటున్నారు. ఈ క్రమంలో ఐదుగురు సభ్యుల ముఠా ఆ ఇంట్లో చొరబడి.. ఓ మహిళపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, మంగళవారం రాత్రి 9.15 గంటల నుంచి ఆర్థరాత్రి వరకు ఈ దారుణం జరిగింది.
అయితే, ఈ ముఠా నుంచి పెద్ద కొడుకు తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించాడు. పోసీలు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. నిందితులంతా స్తానికంగా నివసించే నివాసితులుగా పోలీసులు గుర్తించారు.