చిత్తూరు జిల్లాలో మరో పరువు హత్య?

సోమవారం, 24 జనవరి 2022 (22:05 IST)
ఆ యువతికి 19 సంవత్సరాలు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటప్రాంత వాసి. పేరు హార్థిక. మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ మధ్యనే వివాహం కూడా జరిగింది. 

 
నిన్న సాయంత్రం ద్విచక్ర వాహనం నేర్చుకుంటానని ఇంటి నుంచి వెళ్ళింది. అంతే... రాత్రంతా కనిపించకుండా పోయింది. ఈరోజు మధ్యాహ్నం పిటిఎం మండలం క్రిష్ణాపురం గ్రామ సమీపంలోని పొలం వద్ద శవమై తేలింది వివాహిత.

 
బడికాయల పల్లికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అయితే ఇద్దరిదీ వేర్వేరు కులాలు కావడంతో ఇంటి నుంచి పంపేశారు తల్లిదండ్రులు. భర్త ఇంటిలో ఉన్న సమయంలో హార్థిక నిన్న ద్విచక్ర వాహనంపై  నేర్చుకుంటూ వెళ్ళింది.

 
అయితే ఇంటికి తిరిగి రాలేదు. స్థానికంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి చూశాడు భర్త. చివరకు ఈరోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నానికి హార్థిక శవమై కనిపించింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది హార్థిక. అయితే ఇది అనుమానాస్పద మృతి కాదు హత్యేనంటున్నాడు హార్థిక భర్త. 

 
పరువు హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తల్లిదండ్రులే హార్థికను అతి కిరాతకంగా చంపేసి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేశాడు. ప్రస్తుతం పోస్టుమార్టం జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక తరువాత పోలీసులకు విచారణ జరుపనున్నారు. 

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments