గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 ఏప్రియల్ 2022 (10:06 IST)

బీటెక్ ఫెయిల్: తండ్రి ద్విచక్ర వాహనం నడుపుతుండగా ఉప్పుటేరులో దూకేసాడు

బీటెక్ ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఉప్పుటేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం నాడు కాకినాడ జగన్నాథపురంలో జరిగింది.

 
వివరాలు చూస్తే... కాకినాడకు చెందిన వెంకట రమణ కుమారుడు దుర్గాప్రసాద్ బీటెక్ కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. ఇక అప్పట్నుంచి తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. అతడి స్థితిని గమనించిన తండ్రి మానసిక వైద్య నిపుణుడి వద్దకు తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాడు.

 
ఈ క్రమంలో సోమవారం రాత్రి కుమారుడు దుర్గాప్రసాద్ ను ద్విచక్రవాహనంపై తీసుకుని వస్తుండగా ఉప్పుటేరు వంతెన రాగానే అకస్మాత్తుగా అతడు ఉప్పుటేరులో దూకేసాడు. దీనితో తండ్రి వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఐతే ఇప్పటివరకూ అతడి ఆచూకి లభ్యంకాలేదు.