వికారాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద హత్య
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పదంగా హత్యకుగురైంది. పరిగి మండలం కాళ్ళాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో ఈ హత్య జరిగింది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తెల్లవారేసరికి శవమై కనిపించింది.
మృతురాలిని శిరీష (19)గా గుర్తించారు. శనివారం రాత్రికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష్.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో రక్తపు మరకలతో శవమై కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎస్.ఐ విఠల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు యువతిని హత్య చేసి నీటి కుంటలో పడేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు శిరీష్ ఇంటర్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ కోర్సు చేస్తున్నారు.