శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (21:08 IST)

పూజారి చేతిలో హత్య.. అప్సర పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముంది?

priest - woman
పూజారి చేతిలో హత్యకు గురైన అప్సర హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పూజారి సాయికృష్ణకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన తరుణంలో అతడిని చర్లపల్లి జైలుకి తరలించారు. మరోవైపు అప్సర పోస్ట్ మార్టం రిపోర్టును వైద్యులు పోలీసులకు అందజేశారు. 
 
ఈ రిపోర్టులో మాత్రం కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితుడు సాయికృష్ణ అప్సర తలపై బలంగా బాదాడు. దీంతో ఆమె తలకు బలమైన గాయమైనట్లు వైద్యులు ప్రకటించారు. దీని కారణంగానే అప్సర ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. ఇక పోస్టుమార్టం తర్వాత అప్సర మృతదేహాన్ని ఆమె కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు.