ఆఫీస్ భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

ఠాగూర్
గురువారం, 16 జులై 2026 (09:43 IST)
తాను పని చేస్తున్న భవనంపై నుంచి దూకి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం, బెంగళూరుకు చెందిన తిరువీధి వి.అవినాశ్‌ (40) ఉద్యోగరీత్యా రెండు నెలల క్రితం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చి కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు. 
 
హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కార్యాలయం నుంచి బయలు దేరుతున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఇంటికి రాకపోవడంతో కార్యాలయంలో వాకబు చేయగా వెళ్లిపోయినట్లు తెలిపారు. అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన బంధువు... కార్యాలయం వెనుకకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో శవమై కనిపించారు. 
 
విధులు ముగిశాక నాలుగో అంతస్తులోని ప్లే ఏరియా నుంచి కిందికి దూకినట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది. ఇటీవల సైబర్‌ నేరగాళ్ల కారణంగా రూ.2 లక్షలు పోగొట్టుకున్నారని.. దాంతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అన్నీ చూడండి

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

Kiran Abbavaram: ఒడిదొడుకులు చూశా. ఇలాంటి మంచి సినిమాల కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నా: కిరణ్ అబ్బవరం

Thalapathy: ముగిసిన దళపతి విజయ్ జ‌న నాయ‌గ‌న్‌ నిరీక్ష‌ణ‌.. జూలై 23న గ్రాండ్ రిలీజ్

నాగవంశీ ఆవిష్కరించిన అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

తర్వాతి కథనం
Show comments