కోల్‌కతా న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ప్రేమను నిరాకరించిందనే ప్రతీకారంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైంది. పైగా, వీడియో చూపించి బెదిరిస్తే బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయదని ఈ కేసులో ప్రధాన నిందితుడు భావించాడు. అందుకే పక్కా ప్లానింగ్‌తో విద్యార్థిని క్యాంపస్‌లోనే బంధించి అఘాయిత్యానికి పాల్పడినట్టు తేలింది. ఈ క్రమంలో నిందితులకు న్యాయం చేసేందుకు న్యాయవాదులు సైతం నిరాకరించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మ్యాంగో మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా, అత్యాచార దృశ్యాలను వీడియో తీసి, దానిని బయటపెడతాని బెదిరిస్తే బాధితురాలు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయని తాను భావించినట్టు అంగీకరించాడు. ఈ కేసులో అతడి వాంగ్మూలం నేరం వెనుక ఉన్న దారుణమైన ప్రణాళికను బయటపెట్టింది.
జూన్ 25వ తేదీన అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తుందేమోనని భావించాడు. కాలేజీకి కిలోమీటరు దూరంలో ఉన్న కస్బా పోలీస్ స్టేషన్‌పై నిఘా పెట్టాలన స్నేహితులను కోరాడు. మరుసటి రోజు కాలేజీ సిబ్బందికి ఫోన్ చేసి, పోలీస్ క్యాంపస్‌కు వచ్చారా అని ఆరా తీశాడు. పోలీసుల తన కోసం గాలిస్తున్నారని తెలియగానే న్యాయవాదులైన స్నేహితులకు, కాలేజీ సీనియర్లకు ఫోన్లు చేసి సాయం కోసం అభ్యర్థించాడు. అయితే, ఎవరూ అతనికి సాయం చేసేందుకు ముందుకు రాలేదని తెలిసింది.
ఈ దారుణానికి ప్రతీకారం కారణమని సహ నిందితులు జైబ్, ప్రమిత్ ముఖోపాధ్యాయ పోలీసులకు తెలిపినట్టు సమాచారం. గతంలో మనోజిత్ ప్రేమను బాధితురాలు తిరస్కరించిందని, ఆమెకు గుణపాఠ చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని వారు వెల్లడించారు. నేరానికి రెండు రోజుల ముందే, బాధితురాలు ఎగ్జామ్ ఫారం సమర్పించడానికి క్యాంపస్‌కు వస్తుందని మనోజిత్ తమకు చెప్పాడని సాయంత్రం వరకు ఆమెను అక్కడే ఉంచాలని సూచించాడని వారు తెలిపారు.